ఓటీటీలోకి..నవీన్ ’28 డిగ్రీ సెల్సియస్’

13
- Advertisement -

నటుడు నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ “28 డిగ్రీ సెల్సియస్” సినిమా 2025 ఏప్రిల్ 4న థియేటర్లలో విడుదలైంది. శాలిని వద్నికట్టిని కథానాయికగా తీసుకుని, అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు.

ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది. థియేటర్లలో ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. అయితే ఓటీటీలో మాత్రం దీని ఫలితం ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది.

ప్రియదర్శి, హర్ష చెముడూ, రాజా రవీంద్ర, దేవియాని శర్మ తదితరులు సహాయ పాత్రల్లో నటించారు. సంగీతాన్ని శ్రవణ్ భారద్వాజ్ అందించగా, వీరాంజనేయ ప్రొడక్షన్స్ మరియు రివర్సైడ్ సినిమాస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించాయి.

Also Read:అలా అయితే పాకిస్తాన్‌కే వెళ్లండి:పవన్

- Advertisement -