కశ్మీర్.. టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత

19
- Advertisement -

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. కశ్మీర్ లోయలో 48 టూరిస్టు ప్రాంతాలు మూసివేశారు. మొత్తం 87 టూరిస్ట్ ప్రాంతాల్లో 48 ప్రాంతాలు క్లోజ్ అయ్యాయి. మిగతా ప్రాంతాల్లో సాయిధ బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఇక వరుసగా ఐదో రోజూ LOC వద్ద పాక్ కాల్పులు మొదలుపెట్టింది. మరోసారి కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాక్ సైన్యం. జమ్మూకశ్మీర్‌లోని అక్నూర్ సెక్టార్‌లో పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు.

నిన్న అర్ధరాత్రి కూడా కుప్వారా, బారాముల్లా ప్రాంతాల్లో పాక్ కాల్పులకు తెగబడినట్లు సమాచారం. పాక్ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొట్టింది ఇండియన్ ఆర్మీ.

Also Read:ఎండు ద్రాక్షతో.. మహిళలకు ఆరోగ్యం!

- Advertisement -