లష్కరే తోయిబా అల్తాఫ్ లల్లి హతం!

14
- Advertisement -

లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లి హతం అయ్యాడని సమాచారం. జమ్మూకశ్మీర్‌లోని బందిపోరాలో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరుగగా ఈ ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబా(LTE) టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లిని అంతమొందించాయి భద్రతా దళాలు.

అంతకు ముందు బజిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో తనిఖీలు చేపట్టింది భద్రతా సిబ్బంది.

ఇక మరోవైపు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి మృతదేహానికి నేడు అంత్యక్రియలు జరగనున్నాయి. విశాఖ-జ్ఞానాపురం స్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగనుండగా చంద్రమౌళి అంత్యక్రియల్లో ఏపీ హోం మంత్రి అనిత పాల్గొననున్నారు.

Also Read:BRS Meeting:రోడ్ మ్యాప్, పార్కింగ్ స్థలాల వివరాలు

- Advertisement -