ప్రవీణ్ మృతి ప్రమాదవశాత్తు జరిగిందే:ఐజీ

12
- Advertisement -

ప్రవీణ్ పగడాల మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు అన్నారు ఐజీ అశోక్ కుమార్. అసలేం జరిగిందో మీరే సమగ్ర దర్యాప్తు జరిపి చెప్పండి అని ప్రవీణ్ కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు అన్నారు. మీడియాతో సమావేశంలో మాట్లాడిన అశోక్ కుమార్… ప్రవీణ్ పగడాల మృతి చెందిన రోజు మొత్తం ఆరుగురితో ఫోన్ లో మాట్లాడారు అన్నారు.

2 నెలల కాల్ డేటాను పరిశీలించగా ప్రవీణ్ ఎవరితోనూ అనుమానాస్పదంగా మాట్లాడినట్లు అనిపించలేదు అన్నారు. ప్రవీణ్ ది హత్య అని ఆరోపించిన వాళ్ల దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు అన్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్ లతో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత ప్రవీణ్ .. రెండు చోట్ల వైన్స్ దగ్గర ఆగి మద్యం కొనుగోలు చేశారని తెలిపారు. వైన్స్ వద్ద, పెట్రోల్ బంక్ వద్ద యూపీఐ ద్వారా చెల్లింపులు చేశారని తెలిపారు ఐజీ.

పాస్టర్ ప్రయాణించిన ద్విచక్ర వాహనం దెబ్బతిందని, హెడ్ లైట్ పగిలిపోయిన దృశ్యాలను చూపించారు. హెడ్ లైట్ పగిలిపోవడంతో రైట్ ఇండికేటర్ వేసుకుని పాస్టర్ ప్రయాణించారని చెప్పారు. ప్రమాద స్థలానికి చేరుకున్నపుడు పాస్టర్ ప్రవీణ్ 70 కి.మీ. వేగంతో ప్రయాణిస్తోందని, కంకర రోడ్డు కారణంగా బైక్ స్లిప్ అయి రోడ్డుపక్కన గుంతలో పడిపోయారని వివరించారు. పోస్ట్ మార్టం రిపోర్టులోనూ పాస్టర్ ప్రవీణ్ ఆ సమయంలో మద్యం సేవించి ఉన్నారని వెల్లడైందన్నారు. ఈ ఘటనకు ఇంతటితో ముగింపు పలకాలని… సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Also Read:పర్యావరణ యోధుడు..వనజీవి రామయ్య

- Advertisement -