ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ భద్రాచలంకు రానున్నారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో సీతారాములవారి కల్యాణోత్సవంలో పాల్గొననున్నారు పవన్. ఇందుకోసం ఒక్కరోజు ముందుగానే పవన్ కల్యాణ్ భద్రాచలంకు వెళ్లనున్నారు.
ఏపీ ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలను భద్రాచలం రాములవారికి అందజేయనున్నారు పవన్. ఈ మేరకు మధ్యాహ్నం 12గంటల సమయంలో పవన్ కల్యాణ్ హైదరాబాద్ లోని మాదాపూర్ నుంచి రోడ్డు మార్గంలో ఖమ్మం జిల్లాకు వెళ్తారు. ఖమ్మం జిల్లా మీదుగా సాయంత్రం 5గంటలకు భద్రాచలంకు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు.
ఆదివారం సాయంత్రం 5గంటల సమయంలో భద్రాచలం నుంచి బయలుదేరి రాత్రి 10గంటలకు తిరిగి మాదాపూర్ లోని తన నివాసానికి పవన్ కల్యాణ్ చేరుకుంటారు. మరోవైపు సీతారాముల వారి కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వస్తుడటంతో అధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.
Also Read:KTR: రాహుల్ చేతికే ఆ రక్తపు మరకలు


