తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎండవేడిమి నుండి ఉపశమనం లభించేలా వర్షాలు దంచికొట్టాయి. దీంతో ప్రజలు కొంత ఉపిరి పీల్చుకున్నారు. ఇక ఇవాళ కూడా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో ఉష్ణోగ్రతలు 40°C కన్నా తక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఇక హైదరాబాద్ లో గరిష్ఠ ఉష్ణోగ్రత సుమారుగా 35°C ఉండవచ్చు అని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉష్ణోగ్రతలు 40°C కన్నా తక్కువగా ఉండే అవకాశం ఉందని… పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. విశాఖపట్నం గరిష్ఠ ఉష్ణోగ్రత సుమారుగా 31°C ఉండవచ్చు అని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు.
Also Read:TTD:శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం

