టాలీవుడ్‌లో బ్యూటీ శ్రియా శరణ్ కెరీర్ ప్రారంభించి పద్దెనిమిది ఏళ్లు అయినా స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోతుంది. టీనేజ్ లోనే ఫిలిం ఎంట్రీ ఇచ్చిన ఈమె వయసు ప్రస్తుతం 35 సంవత్సరాలు. ఇంత సుదీర్ఘ కాలం హీరోయిన్ గా కొనసాగడం అనేది చాలా కష్టమైన విషయం. అయితే ఈ అమ్మడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తాజగా శ్రియ ఖాతాలో మంచి మంచి ఆఫర్స్ పడుతుండడం. అది కూడా కీలకమైన పాత్రలు హీరోయిన్ రోల్స్ అవుతుండడం విశేషం.
శ్రియా శరణ్ ఈ ఏడాది ప్రారంభంలో బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణిలో రాణి వశిష్టీ దేవిగా మెప్పించింది . ప్రస్తుతం పూరీ జగన్నాధ్- నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందుతోన్న పైసా వసూల్ చిత్రం లో కూడా హీరోయిన్ గా నటించేస్తోంది. అలాగే కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న నక్షత్రం మూవీలో మాంచి హాట్ హాట్ ఐటెం సాంగ్ ఒకటి చేసేసిన శ్రియ ఇప్పుడ మరో చాన్స్ కొట్టేసింది. సందీప్ కిషన్ హీరోగా రీసెంట్ గా నరకాసురుడు ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. ఈ సినిమాలో శ్రియ నటించబోతుంది.
ఈ చిత్రంలో అరవింద్ స్వామి కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈయనకి జోడీగా నటించేందుకు శ్రియా శరణ్ ను ఖరారు చేశారు. యంగ్ డైరెక్టర్ కార్తీక్ నరేన్ ఈ నరకాసురుడు మూవీకి దర్శకత్వం వహించనున్నాడు. ఈ మూవీ తెలుగు, తమిళం, మలయాళం భాషలలో విడుదల కానుంది. సందీప్ కిషన్, శ్రేయా శరణ్, ఇంద్రజిత్ సుకుమారన్ ఇతర పాత్రలలో నటిస్తున్నారు. కాగా ఈ మూవీని గౌతమ్ మీనన్ నిర్మిస్తుండటం విశేషం. ఆగస్ట్ లో షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రం తెలుగులో నరకాసురుడు టైటిల్ తో విడుదల కానుంది.