సింగిల్ లైసెన్స్ కే ఫిక్స్‌..

151
- Advertisement -

రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లలో సింగిల్ లైసెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఫైలుపై మంగళవారం సంతకం చేశారు.

ఒక వ్యవసాయ మార్కెట్లో లైసెన్స్ వున్న వ్యాపారులు ప్రస్తుతం మరో మార్కెట్లో కొనుగోలు చేయడానికి అవకాశం లేదు. దీనివల్ల ఒక్కో మార్కెట్ కు కొందరు వ్యాపారులు మాత్రమే లైసెన్స్ డ్ ట్రేడర్స్ గా వుంటున్నారు. ఫలితంగా నామా మాత్రపు పోటీ మాత్రమే వుండి రైతులకు గిట్టుబాటు ధర రావటం లేదు.

KCR decides to have Single Licensing policy in Agriculture Markets

ఒక మార్కెట్ లో లైసెన్స్ తీసుకున్న వ్యాపారి రాష్ట్రంలోని ఇతర మార్కెట్లలో కూడా కొనుగోలు చేయడానికి అవకాశం వుంటే ప్రతీ మార్కెట్లోనూ పోటీ పెరిగి రైతులకు మేలు జరుగుతుందని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో సింగిల్ లైసెన్స్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు.

ఇకపై ఏ వ్యాపారి అయినా, ట్రేడర్ అయినా ఒక మార్కెట్లో లైసెన్స్ తీసుకుంటే ఇతర మార్కెట్లో కూడా వ్యాపారం నిర్వహించుకునే వెసులుబాటు కలుగుతుంది. దీనివల్ల వ్యాపారులు పలు చోట్ల లైసెన్స్ తీసుకునే అవసరం వుండదు. మార్కెట్లలో ఎక్కువ మంది వ్యాపారులు వుండడం వల్ల రైతులకు మంచి ధర వచ్చే అవకాశం వుంది. ఆన్ లైన్ ట్రేడింగ్ కు ఈ విధానం ఉపయోగపడుతుందని మార్కెటింగ్ శాఖ అభిప్రాయపడింది.

- Advertisement -