ట్యూబ్ లైట్ కోసం ఝూ ఝూ రాలేదు..!

203
- Advertisement -

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌స్తుతం క‌బీర్ ఖాన్ ద‌ర్శ‌క‌త్వంలో ట్యూబ్ లైట్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు..ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నీ పూర్తి చేసుకొని ప్రమోషన్ పనులలో బిజీగా ఉన్నారు సినిమా యూనిట్. సినిమాలో నటించిన అందరూ ఒకే టీమ్ గా ప్రతి మీడియా ఈవెంట్ కు వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. కానీ ట్యూబు లైట్ సినిమాలో సల్మాన్ ఖాన్ కు జోడీగా నటించిన చైనా నటి ఝూ ఝూ మాత్రం కనిపించటం లేదు. ట్రైలర్ లో ఆమె నటన చూసి అభిమానులు ఇండియా వచ్చినప్పుడు చూడవచ్చు అనుకున్నారు.

Salman Khan At Tubelight Promotions

ఈ చిత్ర ప్రచారంలో ఇదే ప్రశ్న వేయగా డైరెక్టర్ కబీర్ ఖాన్ ఇలా సమాధానపరిచాడు ఆమె చైనాలో తన తదుపరి ప్రొజెక్ట్స్ తో బిజీగా ఉంది. చైనాలో తన బిజీ షెడ్యూల్ వలన ట్యూబు లైట్ సినిమా ప్రమోషన్కు డేట్స్ కుదరలేదు. నా ప్రతి సినిమాలో హీరోయిన్లుకు చాల మంచి పాత్రలు ఉంటాయి ఈ సినిమాలో కూడా ఝూ ఝూ అద్భుత నటనను మీరు చూస్తారు. ఇప్పుడు మీరు పొందిన ఈ నిరాశ పూర్తిగా మరో మూడు రోజులలో పోతుంది” అని వివరించాడు. ఇదే సినిమాలో నటించిన మరో చైనా బాల నటుడు మాటిన్ రే తంగు కూడా ప్రచారంలో పాల్గొన్నాడు. ఏదేమైనా కూడా హీరోయిన్ ప్రమోషన్లకు రావట్లేదంటే ప్రేక్షకుల్లో కాస్త నిరాశే మిగులుతుంది.

 Salman Khan At Tubelight Promotions

మరి ఈ ట్యూబు లైట్ సినిమా జూన్ 23 న విడుదల అవుతుంది. సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఝూ ఝూ అనే చైనా నటి హీరోయిన్ గా నటిస్తుంది. సల్మాన్ తమ్ముడు సొహైల్ ఖాన్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాను సల్మాన్ ఖాన్ తన సొంత ప్రొడక్షన్లో నిర్మించాడు. నీలేశ్ మిశ్రా రాసిన కథను కబీర్ ఖాన్ డైరెక్ట్ చేశాడు. ప్రీతమ్ చక్రబోర్తి మ్యూజిక్ ని సమకూర్చారు.

- Advertisement -