కవితపై కక్ష గట్టిన కాంగ్రెస్: గెల్లు

16
- Advertisement -

మా నాయకురాలు కల్వకుంట్ల కవిత పై ఎమ్మెల్సీ బలమూర్ వెంకట్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం అన్నారు గెల్లు శ్రీనివాస్ యాదవ్. రేవంత్ మెప్పు కోసమే వెంకట్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు …బీసీ ల గొంతుక అవుతున్నందుకే కవిత పై కాంగ్రెస్ కక్ష గట్టింది అన్నారు.

తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన గెల్లు…. అప్పుల పై ప్రభుత్వం చెబుతున్న లెక్కలు తప్పని నిరూపించడమే కవిత చేసిన తప్పా ? చెప్పాలన్నారు. బీసీ బిల్లు లోపాలు ఎత్తి చూపడమే కవిత చేసిన తప్పా ?…మొదట్నుంచి కాంగ్రెస్ బీసీ వ్యతిరేకి అన్నారు.

మండల్ కమిషన్ ను కూడా గతం లో కాంగ్రెస్ వ్యతిరేకించింది…ఎమ్మెల్సీ వెంకట్ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే సహించం ….వెంకట్ కవిత కు క్షమాపణ చెప్పాలి ..సోషల్ మీడియా ను దుర్వినియోగం చేసింది రేవంత్ రెడ్డే ..గతం లో మా నేతల మీద కాంగ్రెస్ నేతలు చేసిన అసభ్య పోస్టుల మీద పోలీసులకు ఫిర్యాదు చేశామ్ ..ముందు వాటిపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి విచారణ చేయాలి అని డిమాండ్ చేశారు.

Also Read:రాష్ట్రంలో రాక్షస పాలన: ప్రవీణ్ కుమార్

- Advertisement -