- Advertisement -
ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా భూపేశ్ బఘేల్ ఇంట్లో సోదాలు జరుపుతున్నారు సీబీఐ అధికారులు. నేడు ఉదయం నుంచి రాయ్‌పూర్, బిలాయ్‌లోని బఘేల్‌కు చెందిన ఇళ్లల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు.
ఇటీవల ఈ నెల 10న బఘేల్ ఇంటిపై ఐటీ రైడ్స్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే కోర్టులో రిలీఫ్ దక్కినప్పటికి తాజాగా సీబీఐ దూకుడు పెంచింది. బఘేల్ ఇంటిపై జరిగిన ఈ దాడులు రాబోయే ఎన్నికల ముందు కీలక పరిణామంగా మారాయి, ఇవి ఛత్తీస్‌గఢ్ రాజకీయ వాతావరణంపై ప్రభావం చూపే అవకాశముంది.
బఘేల్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించినప్పటికీ, సీబీఐ తాజా చర్యతో ఆయన చిక్కుల్లో పడటం ఖాయంగా తెలుస్తోంది.
Also Read:KTR:ప్రజాపాలనలో ప్రగతి అధోగతి
- Advertisement -

