భారీగా చెల్లని ఓట్లు.. వాస్తవం కాదు!

14
- Advertisement -

ఓటు వేయడం తెల్వని పట్టభద్రులు.. సుమారు 40వేల ఓట్లు చెల్లనివిగా ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించారు.

కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌటింగ్ లో భారీగా చెల్లని ఓట్లు ఉన్నాయని వస్తున్న వార్తలు వాస్తవం కాదు అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో 50 వేల వరకు ఓట్లు చెల్లలేదని కొన్ని న్యూస్ చానళ్ళలో ప్రసారం అవుతోంది.. ఇందులో ఎటువంటి వాస్తవమూ లేదు.. ఇప్పటి వరకు కేవలం లక్ష ఓట్లు మాత్రమే ప్రాథమిక లెక్కింపు జరిగిందన్నారు.

Also Read:ఎమ్మెల్సీ ఎన్నికలు విజేతలు వీరే

ఇందులో సుమారు 8000 ఓట్లు మాత్రమే చెల్లుబాటు కాలేదు.. 92 వేల ఓట్లు చెల్లుబాటు అయ్యాయి.. ఇంకా 1,50,000 ఓట్లు లెక్కించాల్సి ఉందని చెప్పారు.

- Advertisement -