ఎమ్మెల్సీ ఎన్నికలు విజేతలు వీరే

20
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. అయితే పట్ట భద్రుల స్థానంలో మాత్రం ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది. తెలంగాణలో జరిగిన టీచర్‌ ఎమ్మెల్సీ స్థానాల్లో పీఆర్‌టీయూ, బీజేపీ గెలుపొందింది. కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలిచారు.

నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం ఎమ్మెల్సీ స్థానాన్ని పీఆర్‌టీయూ గెలుచుకుంది. పీఆర్‌టీయూ అభ్యర్థి పింగిళి శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు. కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ గ్రాడ్యేయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల కౌంటింగ్‌ జరుగుతోంది. మొత్తం 21 టేబుళ్లను వేసి లెక్కిస్తున్నారు. ఈ స్థానంలో మొత్తం 56 మంది అభ్యర్థులు పోటీ చేసిన విషయం తెలిసిందే. 25 ఓట్లకు ఒకటి చొప్పున కట్టి అనంతరం లెక్కిస్తారు. ఈ ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం పూర్తవుతుంది. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు ఉంటుంది.

Also Read:నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా: హరీశ్‌

కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్‌ స్థానంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ గెలిచారు. ఉత్తరాంధ్రలో పీఆర్టీయూ, ఏపీటీఎఫ్‌ అభ్యర్థులకు టీడీపీ మద్దతు ఇచ్చింది. పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపొందారు.

- Advertisement -