తిరుమల పుణ్యక్షేత్రంపై విమానాలు ఎగరకుండా నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడుకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు లేఖ రాశారు.ఈ సందర్భంగా ఆగమశాస్త్ర నిబుధనలు, ఆలయ పవిత్రత, భద్రత, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని లేఖలో పేర్కొన్నారు.
తిరుమల కొండపై తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు, హెలికాప్టర్లు, ఇతర వైమానిక కార్యాకలాపాలతో శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న పవిత్రమైన వాతావరణానికి భంగం కలుగుతోందని తెలియజేశారు.
Also Read:నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా: హరీశ్
తిరుమల పవిత్రత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడటానికి తిరుమల క్షేత్ర గంగనతలాన్ని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించడం ముఖ్యమైన అడుగని తెలిపారు. తక్షణం ఈ విషయంపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో కేంద్ర మంత్రిని టీటీడీ చైర్మన్ కోరారు.

