- Advertisement -
దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచె్తింది. పలు ప్రాంతాల్లో ఎడతెరపిలేని వర్షం కురియడంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపింది.
ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండటంతో ఉద్యోగాలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
మరోవైపు, ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు, హిమపాతం బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. జమ్ముకశ్మీర్లో కుండపోత వర్షాలతో రహదారులు మూసివేశారు.హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
Also Read:మామునూర్ ఎయిర్పోర్ట్కి కేంద్రం గ్రీన్ సిగ్నల్
- Advertisement -

