కుంభమేళా..140 సోషల్‌ మీడియా అకౌంట్లపై కేసు

12
- Advertisement -

ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో మహా కుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే.144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. ఇప్పటివరకు 60 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించగా మరో రెండు రోజుల్లో ముగియనుంది మహా కుంభమేళా.

మహాకుంభ మేళా నేపథ్యంలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న సోషల్ మీడియా అకౌంట్లపై కొరడా ఝుళిపించారు యూపీ పోలీసులు. మహాకుంభంపై దుష్ప్రచారం చేసిన 140 సోషల్ మీడియా ఖాతాలపై కేసులు నమోదు చేసినట్లు మహాకుంభ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వైభవ్ కృష్ణ ప్రకటించారు.

సంబంధిత ఖాతాదారులపై 13 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు వెల్లడించారు. 45 రోజుల పాటు అంగరంగవైభంగా కుంభమేళా జరుగగా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, సినీ ప్రముఖులు పుణ్యస్నానాలు ఆచరించారు.

Also Read:కోహ్లీ..రికార్డుల రారాజు!

- Advertisement -