కేంద్ర బడ్జెట్ 2025-26ను(Union Budger 2025-26) ప్రవేశ పెట్టనున్నారు కేంద్ర మంత్రి నిర్మలతా సీతారామన్(Nirmala Sitaraman). 8వ సారి బడ్జెట్ ప్రవేశ పెట్టనుండగా ఈ బడ్జెట్ పై దేశవ్యాప్తంగా పేదలు, మధ్యతరగతి వర్గాల ప్రజలు, వేతన జీవుల నుంచి పారిశ్రామిక వర్గాల వరకూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ ఉండనుందని ప్రధాని నరేంద్ర మోదీ(narendra Modi) ప్రకటించిన నేపథ్యంలో అంచనాలు అమాంతం పెరిగాయి. ఈసారి బడ్జెట్ లో పలు రంగాల పన్నులు తగ్గించాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. ఆదాయపు పన్ను విధానాన్ని మరింత సరళీకరించడంలో భాగంగా టాక్స్ శ్లాబులను 6నుంచి మూడుకు కుదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
2029 నాటికి కోటి మంది పేదలు, మధ్య తరగతి కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చేందుకు భారీగా సాయం అందించనున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బడ్జెట్‌పై భారీ అంచనాలున్నాయి. కేంద్రం నుంచి లక్షన్నర కోట్లకుపైగా రేవంత్ సర్కార్ ఆశిస్తోంది. మూసీ ప్రక్షాళనకు, మెట్రో ఫేజ్-2కి, రీజనల్ రింగ్ రోడ్డుకు ఇలా పలు కార్యక్రమాలకు కేంద్ర బడ్జెట్ లో నిధులు మంజూరు అవుతాయని ఎదురు చూస్తుంది. ఏపీ ప్రభుత్వం సైతం పోలవరం, అమరావతి అభివృద్ధికి మరిన్ని నిధులు కోరుతున్న నేపథ్యంలో నిర్మలమ్మ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.
Also Read:నీళ్లపై రేవంత్ రెడ్డి నీచ రాజకీయం: కవిత