KTR:రేవంత్ రెడ్డికి కేటీఆర్ చురకలు

2
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డికి చురకలు అంటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.కేటీఆర్ ఐటీ ఎంప్లాయ్ కాబట్టి ఎంప్లాయ్ మైండ్‌సెట్‌తో ఆలోచిస్తాడు. నేను పొలిటీషియన్‌ని, పాలసీ మేకర్‌ని.. నాకు అన్ని తెలవాల్సిన అవసరం లేదంటూ దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్‌ స్పందించారు.

ఐటీ ఉద్యోగుల మేధస్సు, అవిశ్రాంత శ్రమే ఆధునిక సాంకేతిక ప్రపంచానికి వెన్నెముక అని చెప్పారు. వారే లేకుంటే ప్రగతి రథచక్రాలు ఆగిపోతాయన్నారు. తనను ఓ ఐటీ ఉద్యోగి అంటూ తక్కువ చేసి మాట్లాడొచ్చని అనుకునేవాళ్లకు ఒకటే చెప్పదలచుకున్నా అన్నారు.

ఐటీ, ఐటీ అనుబంధ సంస్థల్లో ఉన్న నా అక్కాచెల్లెళ్లకు, అన్నాదమ్ముళ్లకు సలాం. మీ మేధస్సు, అవిశ్రాంత శ్రమే ఆధునిక సాంకేతిక ప్రపంచానికి వెన్నెముక. మీరు లేకుంటే ప్రగతి రథచక్రాలు ఆగిపోతాయి. మీ విద్యార్హతలకు, మీ నిబద్ధతకు కొందరు యాక్సిడెంటల్‌ రాజకీయ నాయకులు సరితూగరు నా విద్యార్హతలు, నా ఉద్యోగ అనుభవం, ఐటీలో నా నేపథ్యం.. ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్న ఉద్యోగులు నాకు ఎప్పటికీ గర్వకారణం అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

 

Also Read:తెలంగాణలో రూ.56 వేల కోట్ల పెట్టుబడులు

- Advertisement -