హైదరాబాద్‌లో విప్రో విస్తరణకు గ్రీన్ సిగ్నల్ పడింది. గోపనపల్లి క్యాంపస్‌లో కొత్త ఐటీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగా విప్రో ప్రకటనను స్వాగతించారు సీఎం రేవంత్ రెడ్డి. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీతో భేటీ అయ్యారు.
5000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలకు అవకాశం లభించనుంది.విప్రో లాంటి పేరొందిన సంస్థలకు తగిన మద్దతు ఇచ్చేందుకు, వ్యాపారాలకు అనువైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని వెల్లడించారు సీఎం రేవంత్.
ట్రిలియన్ ట్రీ ఉద్యమంలో భాగం అవుతామని ప్రమాణం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్ విధానంలో పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Also Read:డిప్యూటీ సీఎం ప్రచారంపై నారా లోకేశ్