కాంగ్రెస్‌తోనే ఢిల్లీ అభివృద్ధి: సీఎం రేవంత్ రెడ్డి

0
- Advertisement -

కాంగ్రెస్‌తోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న షీలా దీక్షిత్ వల్లే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమైంది…తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి సోనియా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు అన్నారు. ఎన్నికల వేళ ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలకు కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందన్నారు రేవంత్.

ఢిల్లీ ప్రభుత్వాన్ని నడపడానికి తెలంగాణ నుండి మద్దతు ఇస్తాం అని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే తెలంగాణ నుండి ఏ సహాయం కావాలన్నా చేస్తాం అన్నారు. మోడీ, కేజ్రీవాల్ ఇద్దరు ఒక్కటే.. పేర్లు మాత్రమే వేరు, ఇద్దరు అబద్ధాలు ఆడుతారు..కాలుష్యంతో తెలంగాణ ప్రజలు ఢిల్లీకి రావాలంటే భయపడుతున్నారు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

కాంగ్రెస్ హామీ ఇచ్చిందంటే వందకు వంద శాతం అమలు చేస్తుందిన్నారు రేవంత్. తెలంగాణలో ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేశాం…దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణాలను మాఫీ చేశాం అన్నారు.

Also Read:ఎన్ని కేసులు పెట్టినా ధర్మం వైపే బీఆర్ఎస్

- Advertisement -