విమానాలకు బెదిరింపు కేసులు ఎన్‌ఐఏకి!

1
- Advertisement -

దేశంలో పలు విమానయాన సంస్థలకు సంబంధించిన బెదిరింపులపై నమోదైన 16 కేసులను ఎన్‌ఐఏకి బదిలీ చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ కేసులను ఎన్‌ఐఏకు బదిలీ చేయాలని ఢిల్లీ పోలీసులు .. హోం శాఖకు లేఖ రాశారు. జాతీయ భద్రతకు సంబంధించిన ఈ విషయం అంతర్జాతీయంగా ప్రభావం చూపుతుంది కాబట్టి లోతైన దర్యాప్తు అవసరం అని అధికారిక వర్గాలు తెలిపాయి.

అక్టోబరు చివరి రెండు వారాల్లో, 510 కంటే ఎక్కువ దేశీయ, అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అవి తర్వాత బూటకమని తేలింది. ఢిల్లీ నుంచి నడిచే 150కి పైగా దేశీయ లేదా అంతర్జాతీయ విమానాలకు బెదిరింపులు రావడంతో 16 కేసులు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

అక్టోబరు 16న బెంగుళూరు వెళ్లే అకాసా ఎయిర్ విమానాన్ని లక్ష్యంగా చేసుకుని ఎక్స్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో మొదటి కేసు నమోదైంది.

Also Read:అల్సర్ ఉందా.. అల్లంతో జాగ్రత్త!

- Advertisement -