స్టాక్ మార్కెట్ రంగంలో నవశకం. ఇకపై 24 గంటలు స్టాక్ మార్కెట్ పనిచేయనుంది. ఇందుకు సంబంధించి యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ (SEC) అమోదం తెలిపింది. ఇది అమల్లోకి వస్తే ప్రపంచ స్టాక్ రంగంలో ఒక కీలకమైలు రాయిగా మారనుంది.
ఈ సదుపాయం అమల్లోకి వస్తే ఆదివారం నుండి గురువారం వరకు నిరంతర ట్రేడింగ్‌ను అందించనున్నారు. ట్రెజరీలు మరియు ప్రధాన కరెన్సీలకు సంబంధించి వారాంతంలో కూడా సేవలు అందిస్తుండగా ఇప్పుడు స్టాక్ సేవలు కూడా అందుబాటులోకి వస్తే స్టాక్స్ పెట్టేవారికి ఖచ్చితంగా మరింత ఉపయోగపడుతుందనే చెప్పాలి.
ఇటీవలి కాలంలో నిరంతర ట్రేడింగ్ చేసే వారి సంఖ్య పెరిగిపోగా డిమాండ్ కూడా అంతేస్థాయిలో ఉంది. ముఖ్యంగా 24/7 క్రిప్టోకరెన్సీ మార్కెట్లకు అలవాటుపడిన రిటైల్ పెట్టుబడిదారులు పెరగడంతో రాబిన్‌హుడ్ మరియు ఇంటరాక్టివ్ బ్రోకర్స్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు US స్టాక్‌లలో ఎక్కువ సమయం పనిచేస్తున్న పరిస్థితి నెలకొంది.
న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో ప్రతీ రోజు 22 గంటల ట్రేడింగ్ జరిగే పరిస్థితి నెలకొనడంతో అఫిషియల్‌గా 24 గంటల స్టాక్ సేవలు అందుబాటులోకి వస్తే అది స్టాక్స్ చేసే వారికి మరింత ఆసక్తిని పెంచే అవకాశం ఉంటుంది. అయితే రాత్రి సమయంలో ట్రేడింగ్‌కు సంబంధించి కొంత అనుమానాలు వ్యక్తమవుతున్న దానిని ఏ విధంగా సంస్థలు అధిగమిస్తాయనేది వేచిచూడాల్సిందే.
Also Read:కొత్తిమీర రసం తాగితే ఎన్ని లాభాలో!