వంటింట్లో కొత్తిమీర వల్ల కలిగే ఉపయోగాలు ఎలాంటివో అందరికీ తెలిసిందే. వంట ఏదైనా ఎలాంటి కూర అయిన వాటికి కొత్తిమీర ఇచ్చే రుచి ఎంతో ప్రత్యేకం. కూరల రుచిని పెంచడంతో పాటు సువాసన కలిగేలా చేయడంలో కొత్తిమీర ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇక కొత్తిమీర తినడం వల్ల కలిగే ఉపయోగాలు కూడా చాలానే ఉన్నాయి. కొత్తిమీరలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కే.. వంటి వాటితో పాటు ఐరన్, కాల్షియం వంటివి కూడా మెండుగా ఉంటాయి. ఇంకా ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి కూడా. కొత్తిమీర ఆకులను అలాగే పచ్చిగా నమలడం వల్ల నోటి దుర్వాసన, పగుళ్లు, అల్సర్, నోటి పుండ్లు.. ఇలా అన్నీ రకాల నోటి సమస్యలను నివారించవచ్చు..
ఇక కొత్తిమీర ఆకులను కషాయంగా చేసుకుని తాగడం వల్ల ఉదర సంబంధిత సమస్యలన్నీ దూరమౌతాయి. గుప్పెడు కొత్తిమీర ఆకులను ఒక గ్లాస్ నీటిలో వేసి ఒక పది నిమిషాలు మరిగించి ఆ తరువాత చల్లార్చి ఆ రసాన్ని తాగడం వల్ల చలికాలంలో తరచూ వేధించే యూరినరీ ఇన్ఫెక్షన్ నయం అవుతాయి. ఇంకా లోబీపీ గాని లేదా హైబీపీ గాని ఉన్నవారు ప్రతిరోజూ కొత్తిమీర కషాయం తాగడం వల్ల ఆ సమస్యలు అదుపులోకి వస్తాయి. ఇంకా కొత్తిమీర లో ఉండే ఔషధ గుణాలు, గుండె సమస్యలను దూరం చేయడంలోనూ, క్యాన్సర్ కారకాలను నిర్మూలించడం లోనూ దోహద పడతాయి. కొత్తిమీర రసాన్ని ప్రతిరోజూ సేవించడం వల్ల వృద్దాప్య ఛాయలు దరిచేరవు. ఇంకా ఇందులో షుగర్ లెవెల్స్ ను తగ్గించే గుణాలు అధికంగా ఉంటాయి. అందువల్ల మధుమేహంతో బాధపడేవారు ప్రతిరోజూ తప్పనిసరిగా కొత్తిమీర రసం తాగడం ఎంతో మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
Also Read:ఓటీటీలో ‘లక్కీ భాస్కర్’ అదిరే రికార్డు!

