మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘డీజే’ పాటల వేడుకలో డిజే దరువు మెగా ఫ్యాన్స్ తో దద్దరిల్లింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరో హీరోయిన్‌లుగా… ఎనర్జిటిక్ డైరక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మిస్తున్న సినిమా `డీజే’ దువ్వాడ జగన్నాథమ్`.
రేసుగుర్రం`, `సన్నాఫ్ సత్యమూర్తి`, `సరైనోడు` వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత బన్ని చేస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ నటించిన డీజేకి ఎంత నెగిటివ్‌గా రియాక్ట్ అయినా…అవన్నీ దాటుకొని మరీ థియేట్రికల్ ట్రైలర్ విడుదలైన రెండు రోజుల్లోనే 10 మిలియన్స్ వ్యూస్‌తో ప్రేక్షకుల నుండి ట్రెమెండస్ రెస్పాన్స్‌ను రాబట్టుకుంటుంది.
ఇక ఇదిలా ఉంటే డీజే ఆడియో వేడుకలో….. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ” దువ్వాడ జగన్నాథం.. డీజే..పబ్బుల్లో వాయించే డీజే కాదు, పగిలిపోయేలా వాయించే డీజే. ” అంటూ ప్రసంగాన్ని స్టార్ట్ చేసి.. డిజే గురించి ఒక్కలైన్‌లో చెప్పాలంటే ఈ డైలాగ్ సరిపోతుందని అన్నాడు బన్ని.
ఇక ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ గురించి మాట్లాడుతూ.. ప్రతి పాటతో తనని ఆడియెన్స్ మనసులకి దగ్గరచేశాడని చెప్పుకొచ్చాడు. ఇక ఇదే వేడుకలో దాసరి నారాయణరావు ను గుర్తు చేశాడు బన్ని. ఇండస్ట్రీ ఒక గొప్ప దర్శకున్ని కోల్పోయిందని అన్నాడు.
ఇక బన్నీ మాట్లాడుతుంటే మెగా ఫ్యాన్స్‌తో పాటు బన్నీఫ్యాన్స్ అరుపులతో డీజే స్టేజ్ దద్దిల్లేలా కేకలు పెట్టారు. మెగా ఫ్యాన్స్‌ని దృష్టిలో పెట్టుకొని వారి గురించి కూడా మాట్లాడుతూ ప్రతి ఒక్క మెగా ఫ్యాన్స్‌తో పాటు తనని ఆదరిస్తున్న అందరు హీరోల ఫ్యాన్స్ కి బన్ని థ్యాంక్స్ చెప్పాడు.
ఇదిలా ఉంటే పవన్ గురించి బన్నీ మాట్లాడతాడని పవన్ ఫ్యాన్సంతా ఎదురుచూశారు. కానీ పవన్ గురించి కాకుండా మెగా ఫ్యామిలీలో ఉన్న అందరు హీరోల ఫ్యాన్స్ ఆడియో వేడుకకి వచ్చినందుకు ధన్యవాదాలు అంటూ.. తన ప్రసంగాన్ని ముగించేశాడు బన్ని. మరోవైపు ఈ మెగా ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరవనున్నాడని అనుకున్నా.. చిరు రాకపోవడంతో ఆడియో వేడుకకి వచ్చిన ప్రేక్షకుల కాస్త నిరాశకు లోనయ్యారు.