ఎంపీ రఘునందన్ రావుపై హైకోర్టు ఫైర్

1
- Advertisement -

బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సీజేకు హైకోర్టు న్యాయమూర్తి లేఖ రాశారు. సుమోటో క్రిమినల్ కోర్టు ధిక్కరణ పిటిషన్ గా సీజే ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని రఘునందన్ రావుకు సీజే ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్-కన్వెన్షన్ కూల్చివేతలను ఆపాలంటూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కూల్చివేతలపై స్టేటస్ కో ఇచ్చింది న్యాయస్థానం. అయితే అప్పటికే కూల్చివేత పూర్తికావడంతో మీడియాతో మాట్లాడిన రఘునందన్ రావు..హైకోర్టు తీర్పుపై విమర్శలు చేశారు.

ఇలాంటి వ్యాఖ్యల వల్ల న్యాయస్థానం ప్రతిష్ట మసకబారుతుందని..హైకోర్టుకు దురుద్దేశాలు ఆపాదించే విధంగా రఘునందన్ రావు వ్యాఖ్యలు చేశారంటూ ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధేకు లేఖ రాశారు. దీనిపై సీజే అరాధే, జస్టిస్ జె. శ్రీనివాసరావు ధర్మాసనం సుమోటోగా క్రిమినల్ కోర్టు ధిక్కరణ కేసును నమోదు చేసింది.

Also Read:ఆకలి వేయట్లేదా..ఇలా చేయండి!

- Advertisement -