వారసుల కోసం తండ్రుల పోరు..కాంగ్రెస్‌లో నయా వార్!

7
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో పార్టీలోని పదవులతో పాటు నామినేటెడ్ పోస్టుల్లో నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే పలు నామినేటెడ్ పోస్టులను భర్తి చేసినా ఇంకా కొన్ని పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటి కోసం కాంగ్రెస్‌ను అంటి పెట్టుకున్ని ఉన్న నేతలతో పాటు కొత్తగా చేరిన నేతల మధ్య గట్టి ఫైట్ నడుస్తోంది.

దీనికి తోడు ప్రస్తుతం జరుగుతున్న కాంగ్రెస్ అనుబంధ సంఘాల ఎన్నికలు ఈ హీట్‌ను మరింత పెంచేశాయి. ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు తనయుల కోసం తండ్రులు చేస్తున్న ప్రయత్నాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా హన్మకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి తీవ్ర పోటి నెలకొంది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి 11 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా, వరంగల్‌, హన్మకొండ, కాజీపేట త్రీ సిటీస్‌లో ఐదుగురు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంత్రి కొండా సురేఖ,ఎమ్మెల్యేలు నాయని రాజేంద్రనాథ్‌రెడ్డి, కేఆర్‌ నాగరాజు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కడియం శ్రీహరి ఉన్నారు. వీరిలో కొండా, కడియం, రేవూరి యూత్ కాంగ్రెస్ వ్యవహారాల్లో అసలు జోక్యం చేసుకోవడం లేదు. అయితే వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు, నాయని రాజేంద్రనాథ్‌రెడ్డి మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నాగరాజు కుమారుడు దిలీప్‌కుమార్‌, ఎమ్మెల్యే నాయని అనుచరుడు పల్లకొండ సతీశ్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వీరికి పోటీగా సీనియర్ నేత నమిండ్ల శ్రీనివాస్‌ కుమారుడు మనోజ్‌ కూడా రేసులో ఉండటంతో ఎవరు అధ్యక్షుడిగా ఎన్నికవుతారోనన్న సస్పెన్స్ మాత్రం అందరిలో ఉంది.

Also Read:లిప్‌లాక్ సీన్లపై ఐశ్వర్య..షాకింగ్ కామెంట్స్!

నమిండ్ల శ్రీనివాస్ కుమారుడు మనోజ్‌ పోలీస్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి మరి యూత్‌ కాంగ్రెస్‌ పదవికి పోటీ పడుతుండగా ఒక జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ పదవికి ఇద్దరు ఎమ్మెల్యేలు, మరో సీనియర్‌ ప్రయత్నిస్తుండటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -