UPSC కొత్త చైర్‌ పర్సన్‌గా.. ప్రీతి సూదన్

22
- Advertisement -

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూఎస్‌పీఎస్సీ) కొత్త చైర్ పర్సన్ గా ప్రీతి సుదాన్ నియమితులయ్యారు. 1983 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. గతంలో UPSACలో సభ్యురాలిగా పనిచేశారు. జూలై 2020లో కేంద్ర ఆరోగ్య కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన సూదన్‌కు ప్రభుత్వ పరిపాలనలోని వివిధ రంగాలలో సుమారు 37 సంవత్సరాల అనుభవం ఉంది.

ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారు. మహిళా, శిశు అభివృద్ధి, రక్షణ మంత్రిత్వ శాఖలలో ముఖ్యమైన పదవులను నిర్వహించారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE) నుండి ఎకనామిక్స్‌లో M.Phil పట్టా పొందారు. బేటీ బచావో బేటీ పడావో, ఆయుష్మాన్ భారత్ వంటి ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించారు. ప్రీతి సూదన్ కృషితో నేషనల్ మెడికల్ కమిషన్ ఏర్పాటు, ఈ-సిగరెట్లపై నిషేధం వంటి ముఖ్యమైన చట్టాలు రూపొందించబడ్డాయి.ప్రపంచ బ్యాంకుకు సలహాదారుగా కూడా పనిచేశారు.

Also Read:‘విరాజి’ టికెట్ రేట్ల తగ్గింపు

- Advertisement -