సీఎం రేవంత్‌ని కలిసిన డీజీపీ జితేందర్

20
- Advertisement -

తెలంగాణ డీజీపీగా నియమితులైన సందర్భంగా సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్.ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్న రవిగుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేయగా ఆయన స్థానంలో జితేందర్‌ని కొత్త డీజీపీగా ఎంపిక చేసింది.

1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి జితేందర్. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్మల్ ఏఎస్పీగా పని చేశారు. బెల్లంపల్లి అదనపు ఎస్పీగా,మహబూబ్‌నగర్, గుంటూరు జిల్లాకు ఎస్పీగానూ సేవలందించారు. విశాఖపట్నం రేంజ్ డీఐజీగా ,వరంగల్ రేంజ్ డీఐజీగా పనిచేశారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేయనున్నారు.

Also Read:Gadari Kishore:రేవంత్‌పై గాదరి కిశోర్ ఫైర్

- Advertisement -