దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ,రేపు ఢిల్లీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా ఢిల్లీలోని ఎంపీలు, మంత్రుల ఇండ్లలోకి కూడా నీరు చేరింది.
గత మూడు నెలలుగా ఎండ తీవ్రతతో అల్లాడిపోయిన ఢిల్లీ ప్రజలు ఇప్పుడు భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శుక్రవారం తెల్లవారు జామున 3 గంటలకు మొదలైన వాన ఏకధాటిగా మూడు గంటలకు పైగా కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాలు నీట మునిగాయి.
యావత్ ఢిల్లీ ప్రాంతాన్ని నైరుతీ రుతుపవనాలు చేరుకున్నాయని ఐఎండీ వెల్లడించింది. జైసల్మేర్, చురు, భివాని, ఢిల్లీ, అలీఘడ్, కాన్పూర్, ఘాజిపూర్, గోండా, ఖేరి, మొరాదాబాద్, డెహ్రాడూన్, ఉనా, పఠాన్కోట్, జమ్మూ ప్రాంతాలకు నైరుతి చేరుకున్నట్లు తెలిపింది.
Also Read:డీఎస్ మృతి..తెలుగు సీఎంల సంతాపం