కల్తీ మద్యం మరణాలు..ప్రభుత్వానిదే బాధ్యత!

2
- Advertisement -

తమిళనాడు కల్తి సారా తాగిన కేసులో మృతుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. అస్వస్థతకు గురైన మరో 60 మందికిపైగా కళ్లకురిచి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో చికిత్స తీసుకుంటున్నారు. ఇక ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ అధికారులను బదిలీ చేయగా సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం స్టాలిన్.

ఈ మరణాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని వీకే శశికళ ఆరోపించారు. కళ్లకురిచి ప్రభుత్వ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్న బాధితులను ఆమె పరామర్శించారు.ప్రభుత్వం తక్షణ చర్యలను చేపట్టకుంటే ప్రజలే నిర్ణయం తీసుకుంటారని శశికళ అన్నారు.

ఈ ఘటనకు బాధ్యులైన వారిని వారం రోజుల్లోగా అరెస్ట్‌ చేయాలని సంబంధిత అధికారులను బదిలీలతో సరిపెట్టకుండా సస్పెండ్ చేయాలని డిమాండ్‌ చేశారు.

Also Read:కల్కి..అఫీషియల్ రన్ టైం!

- Advertisement -