Modi:ఏపీ టూర్ షెడ్యూల్ ఇదే

13
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏపీ టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 12న విజయవాడ కేసరపల్లి ఐటీ పార్కు వద్ద జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు.

ఉదయం 8.20 గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరనున్న మోడీ …ఉదయం 10.40 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రమాణ స్వీకార ప్రాంగణానికి చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12గంటల 45 గంటలకు విమానంలో భువనేశ్వర్ కు వెళ్తారు.

మోడీతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, వివిధ రంగాల ప్రముఖులు చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు. చంద్రబాబు ప్రమాణస్వీకారం కోసం 17 ఎకరాల్లో విస్తీర్ణంలో సీనియర్ అధికారులు, టీడీపీ నేతల పర్యవేక్షణలో ఏర్పాట్లు చేశారు.

Also Read:‘మహారాజ’..అందరికి నచ్చుతుంది:విజయ్ సేతుపతి

- Advertisement -