ఇజ్రాయెల్‌ దాడులను ఖండించిన అమెరికా..

15
- Advertisement -

ఇజ్రాయెల్ – హమాస్ మధ్య యుద్దం కొనసాగుతన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రఫా నగరంలో ఇజ్రాయెల్‌ ఆదివారం జరిపిన దాడులను అమెరికా ఖండించింది. మహిళలు, పిల్లలు సహా పెద్ద ఎత్తున మృతిచెందడంపై విచారం వ్యక్తం చేసిన అమెరికా.. దాడి దృశ్యాలు కలచివేసేలా ఉన్నాయని, చూస్తుంటే గుండె తరుక్కుపోతున్నదని పేర్కొంది.

హమాస్‌కు బుద్ధిచెప్పే హక్కు ఇజ్రాయెల్‌కు ఉంది… అయినప్పటికీ అది సామాన్య పౌరులకు ఎలాంటి ముప్పు తలపెట్టొద్దు అని అభిప్రాయపడింది అమెరికా. హమాస్‌ పెద్ద తలకాయల్ని లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగింది. అదే సమయంలో పౌరుల ప్రాణాలు కూడా ముఖ్యమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వైట్‌హౌస్‌లోని జాతీయ భద్రతా మండలి వ్యూహాత్మక సమాచార విభాగం సమన్వయకర్త జాన్‌ కిర్బీ తెలిపారు.

రఫాలో ఆదివారం రాత్రి ఇజ్రాయెల్‌ భీకర దాడులకు పాల్పడగా ఈ ఘటనలో 45 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 200 మందికిపైగా గాయపడ్డారు. ఇప్పటివరకు గాజా పోరులో అత్యంత పాశవికమైన దాడుల్లో ఇది ఒకటి.

Also Read:అశ్వ సంచాలనాసనంతో వెన్నునొప్పికి చెక్!

- Advertisement -