మనదేశంలో నెలకో పండుగ ఉంటుంది. ఇక్కడి షాపింగ్ మాల్స్.. వాణిజ్య సంస్థలు.. ఈ పండుగలనే క్యాష్ చేసుకోవాలని చూస్తుంటాయి. పండుగల సంధర్బంగా డిస్కౌంట్లు.. భారీ ఆఫర్లు, ఒకటి కొంటే ఇంకొటి ఫ్రీ.. లక్కీ డ్రాలు.. ఇస్తూ ఇలా రకారకాలుగా వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతుంటాయి. రంజాన్ సందర్భంగా సౌదీ అరేబియాలోని ప్రముఖ సూపర్ మార్కెట్ గొలుసు సంస్థ లూలు కూడా తన స్టోర్‌లో అరగంట ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది.
ఇంతకీ ఆఫర్ ఏంటంటే… అరగంట సేపు మాల్‌లో వినియోగదారులు తమకు నచ్చిన వస్తువులను తీసుకెళ్లవచ్చు. ఏ వస్తువు తీసుకున్నా బిల్లు వేయరు. అంటే నగదు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఉచితంగానే ఎవరికి నచ్చిన వస్తువును వారు తీసుకెళ్లిపోవచ్చు. ఇందులో పెద్ద పెద్ద ఖరీదైన టీవీలు.. ల్యాప్ టాప్‌లు కూడా ఉన్నాయి. ఈ ఆఫర్ గురించి తెలుసుకున్న వినియోగదారులు బారులుతీరారు. షాప్ ప్రకటించిన సమయం కోసం వేచి చూశారు. ఈ అరగంట సేపు వినియోగదారులు ఎగబడి తమకు నచ్చిన వస్తువులను తీసుకెళ్లారు. పురుషులు ఎలక్ట్రానిక్ వస్తువుల కోసం ఎగబడగా, మహిళలు తమకు నచ్చిన వస్తువుల కోసం పరుగులు తీశారు. ఇంకొందరు ఒకే వస్తువు తోపులాటకు దిగారు. కొందరికి తమకు నచ్చిన వస్తువు దొరకగా.. మరికొందరికి దొరికిన దాంతో సంతృప్తి చెందారు. ఇంకా ఏం దొరకని వాళ్లు నిరాశగా వెనుదిరిగారు. కాగా, రంజాన్ మాసంలో స్వచ్ఛందంగా దానం మంచిదని ఖురాన్ బోధిస్తుంది. అందుకనుగుణంగా ఈ ఆఫర్ పెట్టినట్టు లూలు సంస్థ తెలిపింది. మన దేశంలోనూ లూలు షాపింగ్ మాల్ కేరళలోని కొచ్చి నగరంలో ఉంది. ఇంతకీ ఆ అరగంటలో జనం ఎలా ఎగబడిపోయారో చూడాలనుకుంటే కింద ఉన్న వీడియో చూడండి..