ష్‌… టీజర్‌ వచ్చేసింది !

190
mahesh-spyder-teaser
mahesh-spyder-teaser
- Advertisement -

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహేష్ బాబు స్పైడర్ సినిమా టీజర్ వచ్చేసింది. 74 సెకండ్ల నిడివి గల ఈ టీజర్ యూట్యూబ్‌లో తాజాగా విడుదలైంది. ఇందులో హీరో మహేష్ కంప్యూటర్ల ఎదుట కూర్చుని హ్యాకింగ్ చేస్తుండగా..  ఓ  రోబో స్పైడర్లా కనిపిస్తూ మహేష్ మీదకు పాకుతుంది. అప్పుడు ఏదో పనిలో ఉన్న మహేశ్‌ పక్కకు తిరిగి ష్‌…. అని సౌండ్‌ చేయడంతో స్పైడర్‌ అక్కడే ఆగిపోవడం హైలైట్‌గా నిలిచింది. జేమ్స్‌బాండ్ సినిమా తరహాలో మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్‌తోనే అంచనాలను భారీగా పెంచేశారు.

ఠాగూర్ మధు సమర్పణలో ఎన్‌వీ ప్రసాద్, రిలయన్స్ ఎంటర్‌మైంట్ సంస్థలు సంయుక్తంగా స్పైడర్ సినిమాను నిర్మిస్తున్నారు.ఇందులో మహేశ్‌కి జోడీగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తోంది. ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా,  స్పైడ‌ర్ చిత్రం ద‌సరా కానుక‌గా సెప్టెంబ‌ర్ 22 న విడుద‌ల కానుంది..

- Advertisement -