ఓడిపోయినా CSK అర్హత సాధిస్తుందా?

43
- Advertisement -

ఐపీఎల్ 2024లో భాగంగా ప్లే ఆఫ్స్ చేరే నాలుగు టీమ్‌లలో ఇప్పటికే మూడు టీమ్‌లు ఖరరాయ్యాయి. గురువారం గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. దీంతో ప్లే ఆఫ్స్‌కి చేరిన మూడో జట్టుగా నిలిచింది హైదరాబాద్‌.

ఇక శనివారం కీలకమైన మ్యాచ్ చెన్నై వర్సెస్ ఆర్సీబీ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌తోనే ప్లే ఆఫ్‌కి చేరే నాలుగో జట్టు ఏదో తేలిపోనుంది. ఇక ఆర్సీబీ ప్లే ఆఫ్ చేరాలంటే ఈ మ్యాచ్ గెలవడంతో పాటు రన్ రేట్ కీలకం. చెన్నైని 18 పరుగుల తేడాతో ఓడించాలి లేదా మరో 11 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందాలి. ఉదాహరణకు RCB స్కోర్ 200 అయితే చెన్నైని 182 పరుగుల లోపే కట్టడి చేయాలి. ఒక వేళ ఆర్సీబీ చేజింగ్ చేస్తే 18.1 ఓవర్లలోనే టార్గెట్‌ని చేధించాలి.

ఆర్సీబీ గెలిచినా మెరుగైన రన్ రేట్ లేకుంటే చెన్నై ఓడిపోయినా ప్లే ఆఫ్స్‌కి అర్హత సాధిస్తుంది. కోల్ కతా ఆడిన 13 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్‌ ప్లేస్‌లో ఉండగా రాజస్థాన్ 8 విజయాలతో రెండో స్థానంలో ఉంది.

Also Read:TTD:పెద్దశేష వాహనంపై గోవిందుడి వైభ‌వం

- Advertisement -