సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ ఎన్నికయ్యారు. గురువారం జరిగిన ఎన్నికల్లో కపిల్ సిబాల్ గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కపిల్ సిబాల్‌కు 1066 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి సీనియర్ న్యాయవాది ప్రదీప్ రాయ్‌కు 689 ఓట్లు లభించాయి.
ఎస్సీబీఏ అధ్యక్ష పదవికి కపిల్ సిబాల్ ఎన్నికవ్వడం ఇది నాలుగోసారి. గతంలో 1995-96, 1997-98, 2001-02ల్లో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పని చేశారు. ఈ సారి ఆరుగురు పోటీ పడగా విజయం సిబాల్‌ని వరించింది.
తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే రాజకీయాలు కోర్టు గదిలోకి రాకుండా చూసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. మా భావజాలం భారత రాజ్యాంగం… చట్టబద్ధమైన పాలనను సమర్థించడం మరియు రాజ్యాధికారం నుండి పౌరులను రక్షించడం అని తెలిపారు సిబాల్. దాదాపు 25 ఏళ్ల తర్వాత అధ్యక్ష రేసులో అడుగుపెట్టిన తాను న్యాయవ్యవస్థకు ఎంతో నిబద్ధతతో ఉన్నానని సిబల్ అన్నారు.
Also Read:థియేటర్ల మూసివేతను ఖండిస్తున్నాం..