ల్యాండ్ టైటిల్ యాక్ట్..నిజానిజాలేంటీ?

30
- Advertisement -

ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా సవాల్‌గా మారిన సమస్య భూమి. తెలంగాణలో ధరణి వచ్చినా ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చినా…ప్రజలకు మంచి చేయడానికేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే  వందల సంవత్సరాలుగా ఉన్న భూ సమస్యలను చెరిపేసి భూ యజమానులు లబ్ది పొందే విధంగా చట్టాన్ని రూపొందించాలి. అయితే ఇది చాలా సున్నితమైన అంశమే..కానీ వివాదాలు మాత్రం ప్రభుత్వాలకు ఇబ్బందికరమే.కానీ ఒకసారి పరిష్కారం దొరికితే రైతులే కాదు భూమి కొన్న భూ యజమానులు సంతోషంగా ఉంటారు.

ఈ నేపథ్యంలో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను గత ఏడాది ప్రవేశపెట్టారు జగన్. సీఎంగా జగన్‌ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 2019 జూలైలో ల్యాండ్‌ టైట్లింగ్‌ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించారు. పలు మార్పుల తర్వాత అక్టోబర్‌ 31 నుంచి ఏపీ ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌-2023 అమల్లోకి వచ్చింది. ఇక ఇప్పుడు ఇదే అన్ని రాజకీయ పార్టీలకు ప్రధానాస్త్రంగా మారింది.

ఆనాడు గతంలో ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ మంచిది.. ఇది హామలు ఐతే రాష్ట్రంలో ప్రజలకు భూ సమస్యలు ఉండవు.. రైతులకు మేలు జరుగుతుంది అంటూ ప్రచారం చేసిన కొన్ని మీడియా సంస్థలే ఇప్పుడు దీనిపై రాద్దాంతం చేస్తుండటం విశేషం. ఎన్నికల సందర్భంగా భూ సమస్యను టార్గెట్‌గా చేసుకుని లబ్ది పొందడానికి ప్రయత్నం చేస్తున్న అవి ఎంతవరకు ఫలిస్తాయో అన్నది ప్రశ్నార్థకమే.

ఎందుకంటే కొత్త చట్టం ప్రకారం ఎటువంటి అభ్యంతరాలు లేని పేర్లే టైటిల్‌ రిజిస్టర్‌లో ఉంటాయి. వివాదాలు ఉన్న భూములను ప్రత్యేకంగా వివాదాల రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. చట్టం ప్రకారం టైటిల్‌ నిర్ధారించే క్రమంలో భూ సమస్యలు ఏర్పడితే పరిష్కారం కోసం ట్రిబ్యునళ్ల వ్యవస్థ ఏర్పాటవుతుంది. ట్రిబ్యునల్‌ తీర్పులపై అభ్యంతరం ఉంటే హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. టైటిల్‌ రిజిష్టర్‌లో నమోదైన వివరాలకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుంది. భూముల రిజిస్ట్రేషన్‌ జరుగుతున్నప్పుడే టైటిల్‌ వెరిఫికేషన్‌ నిర్వహిస్తారు. అమ్మేవాడికి టైటిల్‌ ఉంటేనే కొనేవాడికి వస్తుంది. దీనివల్ల మోసం జరగడానికి వీలు లేకుండా పోతుంది. భూ యజమానులకు రక్షణ కల్పించేందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు.దీని వల్ల ఏదో జరిగిపోతుందోనని విపక్ష కూటమి నేతలు ఆరోపిస్తున్నా ఓటర్ల తీర్పు ఏ విధంగా ఉండడోతుందోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.

Also Read:గ్రీన్ ఛాలెంజ్‌లో నూతన వధువరులు..

- Advertisement -