KTR:బీజేపీ నేతలకు కేటీఆర్ సవాల్

22
- Advertisement -

తెలంగాణ బీజేపీ నేతలకు సవాల్ విసిరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కార్పొరేట్లు అంబానీ,అదానీలకు పద్నాలుగున్నర లక్షల కోట్ల రుణాలను మోడీ మాఫీ చేయలేదని తెలంగాణ బీజేఏపీ నేతలు నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.

ఈ ప‌దేండ్ల‌లో సెస్‌ల పేరు మీద 30 ల‌క్ష‌ల కోట్లు వ‌సూల్ చేసిన మోడీ …అదానీ, అంబానీల‌కు ప‌ద్నాలుగున్నర ల‌క్ష‌ల కోట్ల రుణాలు మాఫీ చేసిండని..ఇది త‌ప్ప‌ని బండి సంజ‌య్, కిష‌న్ రెడ్డి రుజువు చేస్తే రేపు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని స‌వాల్ విసిరారు.

కరోనా సమయంలో ప్రధాని…కార్మికుల‌ను ప‌ట్టించుకోలేదు. రైళ్లు, బ‌స్సులు పెట్ట‌మంటే చ‌ల‌నం లేదు…. హృద‌యం లేని మ‌నిషి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో మోడీ ప్రధాని అయినప్పుడు ముడి చ‌మురు బ్యారెల్ ధ‌ర 100 డాల‌ర్లు.. ఇవాళ 84 డాల‌ర్లు…కానీ పెట్రోల్ ధర ఎందుకు తగ్గడం లేదో ఆలోచించాలన్నారు.

Also Read:పుష్ప… ఫుల్ లిరికల్ వచ్చేసింది

- Advertisement -