ప్రజలను దోచుకోవడానికే కాంగ్రెస్ పార్టీ అధికారం కోరుకుంటుందని మండిపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజాలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ప్రధాని మోడీ..తాను చెప్పిన మాటలు నిజమని ఆ పార్టీ నేతలే పరోక్షంగా నిర్ధారిస్తున్నారని అన్నారు.
బతికున్నంత కాలం కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని దోచుకుంటుంది, చనిపోయాక కూడా మీ ఆస్తులను కాజేస్తుందని మోడీ ఆరోపించారు.ఎల్ఐసీ కంపెనీ స్లోగన్ ను ప్రస్తావించిన మోడీ… జిందగీ కే సాత్ భీ, జిందగీ కే బాద్ భీ అన్నట్లు మీరు కష్టపడి సంపాదించిన సొమ్మును ట్యాక్స్ ల రూపంలో కాంగ్రెస్ లాక్కుంటుందని చెప్పారు. చనిపోయాక మీరు మీ కుటుంబ సభ్యులకు వదిలి వెళ్లే ఆస్తులను ఎలా కాజేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అమెరికాలో అమలవుతున్న వారసత్వ పన్నును కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా మెచ్చుకున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు వదిలి వెళ్లే ఆస్తులపై అమెరికా వారసత్వ పన్ను విధిస్తోందని పిట్రోడా చెప్పారు. దీనిని ఉదహరిస్తూ కాంగ్రెస్‌పై మండిపడ్డారు మోడీ.
Also Read:Gold Rate:లేటెస్ట్ ధరలివే