అయోధ్యలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

20
- Advertisement -

దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. అయోధ్యంలోని రామ మందిరంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. బాలరాముడి ప్రాణ ప్రతిష్ట తర్వాత తొలిసారి శ్రీరామ నవమి వేడుకలు కావడంతో మంగళహారతి, దివ్యాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 3.30 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో స్వామివారిని మేల్కొలిపారు.

నవమి సందర్భంగా రాత్రి 11 గంటల వరకూ రామ్‌లల్లా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12.16 గంటలకు సూర్య కిరణాలు బాలరాముడి నుదుటన తిలకంగా నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు కనిపించనున్నాయి. ఇవాళ ఉదయం పూజకు సంబంధించిన ఫొటోలను ఆలయ ట్రస్ట్‌ ఎక్స్‌ వేదికగా దేశ ప్రజలతో పంచుకుంది.

Also Read:జై హనుమాన్..అదిరే అప్‌డేట్

- Advertisement -