తాటి ముంజలు తింటే ఎన్ని లాభాలో!

32
- Advertisement -

మండే వేసవిలో వేడితాపాన్ని తగ్గించేందుకు ప్రకృతి ప్రసాదించే ఫలాలలో తాటి ముంజలు ఎంతో ముఖ్యమైనది. కేవలం వేసవిలో మాత్రమే లభించే వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. చూడడానికి తెల్లగా గుజ్జుతో కూడిన పదార్థంగా తాటి ముంజలు కనిపిస్తుంటాయి. రుచిలో కాస్త ఒగరు, తీపి కలగలిసిన ఈ తాటి ముంజలలో శరీర వేడిని తగ్గించే ఎన్నో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇందులో దాదాపు 95 శాతం నీరు మిగిలిన 5 శాతం గుజ్జు కలిగి ఉంటుంది. ఇందులో విటమిన్ బి3, బి6, బి7, విటమిన్ సి, విటమిన్ డి వంటి వాటితో పాటు జింక్, ఐరన్, పొటాషియం, కాల్షియం, వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ఉండే వాటర్ కంటెంట్ కారణంగా వీటిని తిన్నప్పుడు శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. ఇంకా డీహైడ్రేషన్ బారిన పడకుండా ఇందులోని పోషకాలు కాపాడతాయి. .

ఇందులో ఉండే పొటాషియం కారణంగా కిడ్నీల పనితీరు మెరుగు పడుతుంది. తద్వారా వేసవిలో తరచూ వేధించే మూత్రంలో మంట సమస్య తగ్గుతుంది. తాటి ముంజలను క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. వేసవిలో చాలమందికి ఎండ తీవ్రత కారణంగా వికారం, వాంతులు, తలనొప్పి వంటి సమస్యలు వేధిస్తుంటాయి. అలాంటి సమస్యలను తగ్గించడంలో తాటిముంజలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇక తాటి ముంజల గుజ్జును ఫేస్ ప్యాక్ లా కూడా ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల మొఖం పై ఉండే జిడ్డు, మచ్చలు వంటివి తొలగిపోయి ఫేస్ అందంగా తయారవుతుంది. తాటి ముంజలను జ్యూస్ రూపంలో కూడా సేవించవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల బాడీలోని టాక్సిన్ చెమట రూపంలో బయటకు పోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందువల్ల వేసవిలో మాత్రమే లభించే తాటి ముంజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కాబట్టి తప్పనిసరిగా వీటిని తినాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

సూచనలు ; తాటి ముంజలు ఎక్కువగా తినడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్తి, కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి .వీటిని మితంగానే తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:చిరు..మే డే వింటేజ్ వీడియో

- Advertisement -