జనసేన పార్టీ మళ్ళీ తెలంగాణలో సత్తా చాటేందుకు సిద్దమందా ? తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు రెడీ అయిందా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఎనిమిది స్థానాల్లో పోటీ చేసింది జనసేన పార్టీ. కానీ ఊహించని విధంగా ఆ పార్టీకి కనీసం డిపాజిట్లు కూడా దక్కకపోవడంతో తెలంగాణలో జనసేన బలం లేదని తేలిపోయింది. అయితే మొదటి నుంచి కూడా అధినేత పవన్ తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెడుతూ వచ్చారు. ఎలాగైనా ఇక్కడ కూడా పార్టీని పూర్తి స్థాయిలో బలపరచాలని భావిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో మరోసారి లక్ టెస్ట్ చేసుకునేందుకు పవన్ సిద్దమైనట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం..
తాజాగా తెలంగాణలో జనసేన పార్లమెంట్ ఎన్నికల సమన్వయ కమిటీని ఏర్పాటు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే 17 లోక్ సభ స్థానాలకు గాను ఇంతవరకు ఒక్క అభ్యర్థిని కూడా జనసేన ప్రకటించలేదు. దాంతో లోక్ సభ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందా ? లేదా ఇతర పార్టీలకు మద్దతుగా నిలుస్తుందా అనేది ఆసక్తిరేపుతున్న ప్రశ్న. ప్రస్తుతం జనసేన పార్టీ ఎన్డీయే కూటమిలో భాగంగా ఉంది. అంతే కాకుండా ఏపీలో బీజేపీ టీడీపీ పార్టీలతో పొత్తులో ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా బీజేపీకి మద్దతుగా నిలిచే అవకాశం లేకపోలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీతో తమకు పొత్తు ఉండబోదని తెలంగాణ బీజేపీ నేతలు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. దాంతో తెలంగాణలో జనసేన పోటీ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై ప్రస్తుతం అరకొర వార్తలు వినిపిస్తున్నప్పటికి.. పూర్తి సమాచారం లేదు. మరి ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్న జనసేన పార్టీ తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తుందో లేదో చూడాలి.
Also Read:ఉదయాన్నే తలనొప్పి వస్తే..ఇలా చేయండి!