ఎలక్షన్ టైమ్..సినీ గ్లామర్ ఎక్కడ?

19
- Advertisement -

ఎలక్షన్ రాగానే ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. పర్యటనలు, రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తు పొలిటికల్ హీట్ పెంచుతుంటారు. పొలిటికల్ లీడర్స్ కు తోడు సినీ తారలు కూడా ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడం చూస్తూనే ఉంటాం. 2009, 2014, 2019.. ఇలా ఎన్నికల సమయంలో ప్రతిసారి ఆయా పార్టీల నుంచి సినీ తారలు ప్రచారాలు చేస్తూ వచ్చారు. కానీ ఈసారి మాత్రం సినీ తారలు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నట్లు కనిపిస్తోంది. గతంలో టీడీపీ తరుపున జూ. ఎన్టీఆర్ 2009 ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఆ టైమ్ లో ఎన్టీఆర్ ప్రచారం తెలుగు దేశం పార్టీకి బాగానే హెల్ప్ అయింది. కానీ ఆ తర్వాత ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

2014, 2019 ఎన్నికల్లో ఆయన ఎలాంటి ప్రచార కార్యక్రమాలు చేపట్టలేదు. ఇకపోతే టీడీపీ తరుపున నటసింహ నందమూరి బాలకృష్ణ కూడా ప్రచార కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనే వారు. కానీ ఈసారి మాత్రం బాలకృష్ణ కూడా అంతగా యాక్టివ్ గా లేరు. అయితే ఈసారి కూడా టీడీపీ తరుపున హిందూపురం అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే పవన్ ఆల్రెడీ సినీ స్టార్ కావడంతో గత ఎన్నికల టైమ్ లో పవన్ కు మద్దతుగా చాలా మంది సినీ తారలు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను మద్దతు పలుకుతూ వచ్చారు. కానీ ఈసారి ఎన్నికల్లో పవన్ కు మద్దతుగా ఏ సినీ స్టార్ గాని, హీరోలు గాని ఎలాంటి ప్రచార కార్యక్రమాలు చేపట్టడం లేదు.

దీంతో సినీ ఇండస్ట్రీ ఈసారి ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి గల కారణం ఏమిటంటే.. ఒక పార్టీకి ప్రచారం చేయడం వల్ల ఎన్నికల్లో వేరే పార్టీ గెలిస్తే తమ సినిమాలపై ప్రభావం పడుతుందనే భయంతోనే సినీ తారలు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నట్లు రాజకీయ వాదులు చెబుతున్నారు. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీకి మద్దతు పలికితే ఎలాంటి సమస్య ఉండదనే అభిప్రాయం కూడా చాలమంది తారాల్లో ఉండే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికి సినీ తారలు ఎలక్షన్ ప్రచారాలకు దూరంగా ఉండడం కొంత చర్చనీయాంశమే.

Also Read:Allu Arjun: హ్యాపీ బర్త్ డే బన్నీ

- Advertisement -