- Advertisement -
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేతలకు నోటీసులు పంపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మంత్రి కొండా సురేఖతో పాటు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి,కేకే మహేందర్ రెడ్డిలకు నోటీసులు పంపారు.
తన ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా ప్రకటనలు చేసింనందుకు క్షమాపణలు చెప్పాలని, లేకుంటే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. చట్టప్రకారం అందరిపైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే పలు మీడియా సంస్థలు, యూ ట్యూబ్ ఛానళ్లకు నోటీసులు పంపారు కేటీఆర్. తప్పుడు ప్రచారం చేస్తే సీఎం అయినా సరే వదిలిపెట్టేది లేదన్నారు.
Also Read:Janasena:’గ్లాసు’తో జనసేనకు ఇబ్బందే!
- Advertisement -