రాబోయే ఎన్నికల్లో మోడీ సర్కార్ ను గద్దె దించే లక్ష్యంతో ఇండియా కూటమి ఏర్పడిన సంగతి తెలిసిందే. కూటమిలో దాదాపు 26 పార్టీలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలో సాగిన యూపీయే కూటమిని కొత్తగా పేరు మార్చి ఇండియా కూటమిగా నామ కారణం చేశారు. తొలి నాళ్ళలో నానా హడావిడి చేసినప్పటికీ ఎన్నికల ముందు మాత్రం కూటమి అనుకున్న స్థాయిలో యాక్టివ్ గా కనిపించడం లేదు. దానికి కారణం అంతర్గతంగా కూటమిలో ఏర్పడిన అనిశ్చితి అనేది విశ్లేషకులు చెబుతున్న మాట. కూటమిలోని కాంగ్రెస్ ఆధిపత్యం చెలాయించడం, సీట్ల సర్దుబాటులో ఇతర పార్టీలకు అన్యాయం చేయడం వంటి కారణాలతో తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ వంటి కూటమి నుంచి బయటకు వచ్చాయి. .
ఇంకా మరికొన్ని పార్టీలు సైతం కూటమిలో అసంతృప్త గళాన్ని వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో ఎన్నికల ముందు ఈ అంశం కూటమిని గట్టిగానే దెబ్బ తీస్తోంది. ఇది చాలదన్నట్లుగా కూటమిలో కీలకంగా ఉన్న ఆప్ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లిక్కర్ స్కాం లో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో కూటమి మరింత బలహీన పడింది. ఈ సమస్యలతోనే సతమతమౌతుంటే ఇప్పుడు మరో సమస్య ఇండియా కూటమిని వెంటాడుతోంది. విపక్షాలు ఇండియా కూటమి అని పేరు పెట్టడంపై గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు అయిన సంగతి తెలిసిందే.
దీనిపై ఢిల్లీ హైకోర్టు తాజాగా స్పందించింది. రాజకీయ కూటమికి దేశ పేరు వాడుకోవడంపై వివరణ ఇవ్వాలని కేంద్రం విపక్షలకు హైకోర్టు ఆదేశించింది. దీనిపై ఈ నెల 10న వాదనలు వింటామని తెలిపింది. దీంతో ఇండియా కూటమి చిక్కుల్లో పడింది. తీర్పు ఏ మాత్రం ప్రతికూలంగా వచ్చిన కూటమి పేరు మార్చుకోక తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ఎన్నికల ముందు పేరు మార్చాల్సి వస్తే ఆ ప్రభావం కూటమిపై మరింత ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది. మరి అసలే అంతర్గత అనిశ్చితితో కుదేలవుతున్న ఇండియా కూటమికి పేరు అంశం ఎలాంటి తిప్పలు తెచ్చిపెడుతుందో చూడాలి.
Also Read:TTD:శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం