31న జనగామకు కేసీఆర్..

21
- Advertisement -

ఈ నెల 31న(రేపు) జిల్లాల్లో పర్యటించనున్నారు మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. నీళ్లందక ఎండిపోతున్న పంటపొలాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, కరువుకు అల్లాడుతున్న రైతాంగానికి ధైర్యాన్ని నింపేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల మార్చి 31 న జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటించనున్నారు.

నేరుగా రైతుల వద్దకు వెళ్లి, మీకు మేము అండగా ఉంటామన్న భరోసా కల్పించనున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక, సభలు, సమావేశాలతో బిజీగా ఉంటే, కేసీఆర్‌ మాత్రం రైతులకు మనోధైర్యం కల్పించేందుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. త

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటినా హామీలను అమలు చేయకపోగా మరింత కుంగదీసే చర్యలకు పాల్పడుతుందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ఇప్పటికే రైతుల కోసం అవసరమైతే సచివాలయాన్ని ముట్టడిస్తామని మాజీ మంత్రి హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడంతోపాటు రైతులను ఆదుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

Also Read:డియర్..రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -