ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్‌ను 6 రోజుల కస్టడీకి అనుమతిస్తు నిర్ణయం తీసుకుంది రౌస్ అవెన్యూ కోర్టు. జడ్జి జస్టిస్ కావేరీ బవేజా ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించారు. ఈ నెల 28వ తేదీ వరకు కేజ్రీవాల్‌ను కస్టడీ విధించడంతో జైలు నుండే పాలన చేస్తారా లేదా అన్న సందిగ్దం నెలకొంది.
ఈడీ రిమాండ్ ను వ్యతిరేకించాలన్న కేజ్రీవాల్ తరుపు న్యాయవాదుల వాదనలను ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. లిక్కర్ కేసులో కేజ్రీవాలే ప్రధాన సూత్రధారి అని న్యాయస్థానానికి తెలిపారు ఈడీ అధికారులు. కేజ్రీవాల్ ను 10రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరగా 6 రోజుల కస్టడీ అనుమతించింది.
కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని, ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని చెప్పినప్పటికీ.. కేజ్రీవాల్ తరుపు న్యాయవాదుల వాదనలను కోర్టు పరిగణలోకి తీసుకోలేదు.
Also Read:IPL 2024 :చెన్నై బోణి.. ధోని రికార్డ్!