Modi:మోడీ బెదిరింపులే కారణమా?

33
- Advertisement -

ఈ మద్య కాలంలో ప్రతిపక్ష నేతలపై ఈడీ, సీబీఐ కేసులు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. మోడీ పాలనకు వ్యతిరేకంగా నినాదించే ప్రతి ఒక్కరిపై అక్రమ కేసులు బనాయిస్తూ రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేస్తోంది బీజేపీ సర్కార్. ముఖ్యంగా దర్యాప్తు సంస్థలను గుప్పిట్లో ఉంచుకొని ప్రత్యర్థి పార్టీ నేతలపై అస్త్రాలుగా వాడుతోంది. ఈ నేపథ్యంలో ఈడీ కేసులకు బయపడి కొంతమంది నేతలు బీజేపీలో చేరేందుకు సిద్దమౌతుంటే.. మరికొంతమంది వేరే దారి లేక జైలు బాట పడుతున్నారు. ఇలా నియంత ధోరణిలో మోడీ సర్కార్ వ్యవహరిస్తోంద్నే విమర్శలు వ్యక్తమౌతున్నాయి. బీజేపీతో చేతులు కలిపితే ఈడీ కేసులు కొట్టివేస్తామని ఆ పార్టీ నేతలు ఆఫర్ ఇచ్చినట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి గత కొన్నాళ్లుగా తరచూ వ్యాఖ్యానిస్తూనే ఉన్నారు. .

ఢిల్లీ లిక్కర్ స్కాం లో భాగంగా కేజ్రీవాల్ కు తొమ్మిది సార్లు ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక పోతే కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది ఈడీ కేసులతో తలపట్టుకుంటున్నారు. తాజాగా దర్యాప్తు సంస్థల విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ దర్యాప్తు సంస్థల ఒత్తిడి తట్టుకోలేక చాలమంది పార్టీ వీడుతున్నారని, సెంట్రల్ ఏజెన్సీల ద్వారా మోడీ బెదిరింపులకు పాల్పడుతున్నారాని కొంతమంది నేతలు సోనియా గాంధీ వద్ద వాపోతున్నట్లు రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు.

ఇటీవల కాలంలో కాంగ్రెస్ లోని చాలామంది అగ్రనేతలు పార్టీని వీడిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర మాజీ సి‌ఎం అశోక్ చౌహాన్, బాబా సిద్దిఖీ, మిళింద్ దేవరా వంటి ఎంతో మంది నేతలు కాంగ్రెస్ కు గుడ్ బై చెబుతూ వచ్చారు. ఇంకా ముందు రోజుల్లో మరికొంత మంది నేతలు కాంగ్రెస్ వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయా పార్టీలను వీడుతున్న వారంతా బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా ప్రతిపక్ష నేతలపై బెదిరింపులకు పాల్పడుతూ అక్రమ చేరికలకు బీజేపీ తెర తీసినట్లు ప్రధానంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఈ రకమైన విమర్శలకు కమలనాథులు ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.

Also Read:జగన్ ప్రచారానికి ‘సిద్ధం’ ?

- Advertisement -