2006లో హార్వార్డ్ విద్యార్థి అయిన మార్క్ జుకర్‌బర్గ్ మధ్యలోనే చదువు మానేసి ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడిగా మారి ప్రపంచమొత్తాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.13ఏళ్ల క్రితం మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్… వెబ్‌సైట్‌ను ఎక్కడ ప్రారంభించారో తెలుసా..? ఆయన చదువుకున్న హార్వర్డ్ యూనివర్శిటీలోని హాస్టల్ గదిలో. ఈ విషయాన్ని జుకర్ స్వయంగా ఫేస్‌బుక్ లైవ్ ద్వారా చూపించారు. ఆ గదిని ప్రపంచానికి పరిచయం చేశారు.
ఫేస్‌బుక్ కోసం జుకర్ తన చదువును కూడా వదిలేసుకున్న జుకర్ బర్గ్.. కేంబ్రిడ్జ్‌లోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్శిటీలో చదువుకుంటున్న రోజుల్లోనే ఫేస్‌బుక్‌ను డెవలప్ చేశారు. 2004, ఫిబ్రవరి 4న ‘ది ఫేస్‌బుక్’ పేరుతో ఓ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంను ప్రారంభించారు. అదే ఏడాది హార్వర్డ్‌ను వదిలేసిన జుకర్.. అలా 2006లో డిగ్రీ పూర్తి చేయాకుండానే.. ప్రపంచానికి ఫేస్‌బుక్‌ను పరిచయం చేశారు. ఇపుడు దాదాపు 13 ఏళ్ల తర్వాత జుకర్ ఇప్పుడు మళ్లీ హార్వర్డ్ లో అడుగుపెట్టారు. ఈ ఏడాది జరిగే గ్రాడ్యుయేషన్ డేలో పాల్గొని ప్రసంగించాలని జుకర్‌ను హార్వర్డ్ యూనివర్శిటీ ఆహ్వానించింది.
గ్రాడ్యూయేషన్‌లో పాల్గోనడమే కాదు.. డిగ్రీ కూడా తీసుకున్నారు. తన కాలేజీ రోజుల్ని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా హార్వర్డ్‌లో చదువుకునేప్పుడు తాను ఉన్న హాస్టల్‌గదికి వెళ్లాడు. ‘ఇదిగో ఈ గదిలోనే ఫేస్‌బుక్ పుట్టింది’ అంటూ జుకర్ లైవ్ ప్రారంభించారు. ఆయన వెంట జుకర్ సతీమణి ప్రసిల్లా కూడా ఉన్నారు. ఈ వీడియోను షేర్ చేసిన కొద్ది గంటల్లోనే లక్షల మంది వీక్షించారు. కాలేజీ రోజులు మరుపురాని జ్ఞాపకాలని చెబుతూ గదినంతా చూపించారు జుకర్.