చీర విప్పినా…కిక్కులేదు..

465
lavanya tripati dont given glamour kick for fans
- Advertisement -

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకు గ్లామర్‌ చూపిస్తేనే చేతినిండా ఆఫర్లు. అయితే అందరూ గ్లామర్‌నే ఎరగా వేయలేరు. అప్పుడప్పుడు నిండుగా చీర కట్టులో కనిపిస్తూ కూడా ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేస్తుంటారు. ఇలాంటి క్యారెక్టర్‌ లోనే సక్సెస్‌ ని టచ్‌ చేస్తారు కొంతమంది హీరోయిన్లు.

అయితే లావణ్యత్రిపాఠి కూడా అలాంటి కిక్కునే ఎంజాయ్‌ చేసింది. కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా చీర విప్పేస్తానంది.  కారణం.. చీర బోర్ కొడుతోందని లావణ్య ఫీలింగ్.  అంటే గ్లామర్‌ రోల్స్‌ చేస్తూ..ఆడియెన్స్‌ కి అందాల విందు వడ్డించడానికి రెడీగా ఉన్నట్టు చెప్పేసింది.
 lavanya tripati not give glamour kick for fans
అనుకున్నట్టుగానే తన గ్లామర్‌తో రాధ సినిమాలో రెచ్చిపోయింది లావణ్య. తాను ఇప్పటివరకు చేసిన సినిమాలలో చూపించని అందాలని రాధ లో చూపించేసింది. అయితే లావణ్య అనుకున్నది ఒకటయితే..జరిగింది ఇంకొకటి. తన అందాలే తనకి మైనస్ గా మారాయి. అవును..లావణ్య త్రిపాఠిని అందరూ ఇదే మాట అంటున్నారు. మొదటి నుంచి గ్లామర్‌ పాత్రలు చేయని లావణ్య తన జోనర్‌ నుంచి బయటకు వచ్చి మొదటిసారి ‘రాధ’లో అందాల ప్రదర్శన చేసింది.
 lavanya tripati not give glamour kick for fans
అయితే లావ‌ణ్య ఇక్కడే పప్పులో కాలేసింది అంటున్నారు సినీ జనాలు. ఇప్పటి వరకూ లావణ్య కొద్దిగా బొద్దుగా ఉండేది. పక్కింటి అమ్మాయి పాత్రలకు ఆమె సరిగ్గా సరిపోయింది. ఇప్పుడు ఈ సినిమా కోసం బరువు తగ్గి బాగా వర్కవుట్లు చేసి స్లిమ్‌గా మారింది.

ఇప్పటి వరకూ లావణ్యను నిండుగా చూడడానికి అలవాటు పడిన ప్రేక్షకులు బక్కచిక్కికనిపించిన లావణ్యను పెద్దగా ఇష్టపడలేదు. దాంతో ఈ సినిమాలో చేసిన అందాల ప్రదర్శన అంతా వృధా అయిపోయింది అంటున్నారు సినీ జనాలు. అంతేకాకుండా లావణ్య చీర విప్పినా ఆడియెన్స్‌కి మాత్రం కిక్కులేకుండాపోయిందని టాక్‌.

- Advertisement -